Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓడ్డుచేరి నీ యెదుటనిల్పునపుడు రక్షకాఒక్క యాత్మనైన Telugu Christian Song Lyrics

ఓడ్డుచేరి నీ యెదుటనిల్పునపుడు రక్షకాఒక్క యాత్మనైన Lyrics


1. ఓడ్డుచేరి నీ యెదుట
నిల్పునపుడు రక్షకా
ఒక్క యాత్మనైన తేక
సిగ్గుపడిపోదునా.
||ఒక్క యాత్మనైన నేను
రక్షింప యేసువా
వట్టి చేతులతో నిన్ను
దర్శించుట తగునా||

2. ఆత్మలందు వాంఛలేక
సోమరులై కాలమున్
వ్యర్థపరచు వారానాడు
చింతతోడ నిల్తురు.

3. యేసువా! నా స్వరక్షణ
నిశ్చయంబు యైనదే
ఐనఫలితంబుజూడ
కష్టపడనైతినే.

4. కాలమెల్ల గడ్చిపోయెన్
మోసపోతినేనయ్యో
గడ్చినట్టి కాలమైతే
ఏడ్చినను రాదది.

5. భక్తులారా! ధైర్యంతోడ
లేచి ప్రకాశించుడీ
ఆత్మలెల్ల యేసుయొద్ద
చేరునట్లు చేయుడి.

Your favourites

  • No Favourites found!