Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓహో! యెరూషలేమా బంగారు పట్నమానీయందు దృష్టి Telugu Christian Song Lyrics

ఓహో! యెరూషలేమా బంగారు పట్నమానీయందు దృష్టి Lyrics

1. ఓహో! యెరూషలేమా - బంగారు పట్నమా
నీయందు దృష్టి క్షేమ - మింపార నుండుగా
ఆ కాంతి సంబరమ్ము - ఏ కన్ను కాంచెను
జీవంపు భోజనము నీలోను తిందుము
2. సీయోను కొండపైన దూతాళి భక్తులు
ఆ రక్త సాక్షులైన - వారెల్ల బాడుచు
ఆ నిత్య కాంతిలోను - మహా ముదంబుతో
శ్రీ యేసు క్రీస్తుతోను - సదా సుఖింతురహో
3. విముక్తులైనవారు - శ్రీ యేసుతోడున
జయంబు గొన్నవారు - నిత్యంబు నందున
శ్రీ యేసు గద్దెచుట్టి - తెల్లంగి ధారులై
కీర్తించి కేలుతట్టి - హర్షింతు నిత్యులై
4. ఓ దివ్య పట్టణంబ విశ్రాంతి స్థానమా
భక్తాళి వాంఛితంబ - ఆశింతు నిన్ సదా
ఓ యేసు నన్నుగూడ - అచ్చోట జేర్చుము
ఆ భాగ్యమేను జూడ - స్తోత్రింతు నెన్నడు


Your favourites

  • No Favourites found!