ఓహోహో మా యన్నలారా యుద్యోగింపండి యిపుడే త్రాహి త్రాహి
యనుచుఁ క్రీస్తుని దయను గోరండి ||ఓహో||
1. అంత్యదినము నాటి బాధ లాలకించండి నరక ప్రాంతమునకుఁ
బోకమునుపే ప్రభువును వేడండి ||ఓహో||
2. మింట ప్రభువు తేజోమయమౌ మేఘారూఢుండై యగ్ని మంట
వీను సింహాసనము నంటి కూర్చుండు ||ఓహో||
3. అంధకారమగును సూర్యుఁడా దినమందు కుముద బాంధవుడు మిగుల
రక్త వర్ణము నొందును ||ఓహో||
4. కడు భీతిగ సర్వసృష్టి కంపించుచు నుండున్ భూమి కడలి యభ్రము
తాపమున కరిగి పోవుచుండున్ ||ఓహో||
5. నరక ప్రచండాగ్ని గుండ మరదై గన్పడును దానిఁ జొరక మరి యే
తెరువు పాపా త్ములకు గలుగును ||ఓహో||
6. ప్రేమతో నడిగెదను నా ప్రియబంధువులార మీర లామహా
దినమందున దిరమై యట నిలువంగలర ||ఓహో||
7. కామక్రోధ లోభమోహ గర్వగుణములను మీరు ప్రేమించి చేసితిరి
గద పెక్కు విధములను ||ఓహో||
8. కల్లలాడుచుడి ప్రొద్దుఁ గడుపుచుంటిరే యింక చిల్లర వేల్పుల పూజ
చేయుచుంటిరే ||ఓహో||
9. ప్రకటంబుగ నైన మరి గు ప్తస్థల మందైన చేయు సకల క్రియలు
ప్రభువున కెఱుక సంపూర్ణముగాను ||ఓహో||
10. జాతి గోత్రమడుగఁ బోడు సర్వేశ్వరుండు క్రియల రీతి మనసు
మాత్రమె విచా రించు ప్రభువతఁడు ||ఓహో||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఓహోహో మా యన్నలారా యుద్యోగింపండి యిపుడే Lyrics
Your favourites
- No Favourites found!
