Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఒక వరమడిగితిని యేసయ్యా నీలా ఉండాలని Telugu Christian Song Lyrics

ఒక వరమడిగితిని యేసయ్యా నీలా ఉండాలని Lyrics

ఒక వరమడిగితిని యేసయ్యా
నీలా ఉండాలని – మండుచుండాలని
నీలా ఉండాలని – మండుచుండాలని (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఒక వరమడిగితిని||
నాలో నేరము స్థాపించగలరా
ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో (2)
నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు
నీ మార్గములలో నడిపించవా (2) ||ఒక వరమడిగితిని||
సర్వ సృష్టికి సర్వాధికారి
తల వాల్చుటకును స్థలమింత లేదా (2)
నేను లోకాశ విడచి పైనున్నవాటి
గురి కలిగి వెదకి పొందాలని (2) ||ఒక వరమడిగితిని||
తండ్రిని విడచి పారమును వీడి
నన్ను సమీపించినావు (2)
నేను కలిగున్నదంత నీ పాదాల చెంత
అర్పించి నీ చెంత చేరాలని (2) ||ఒక వరమడిగితిని||
దేవుని చిత్తము సంపూర్తి చేయగ
సిలువలో వ్రేళాడి శ్రమ నొందినావు (2)
నేను నీ సిలువ మోయుచు కడవరకు ఇలలో
నీ సాక్షిగా జీవించాలని (2) ||ఒక వరమడిగితిని||

Your favourites

  • No Favourites found!