Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఒకని తల్లి ఆదరించునట్లు Telugu Christian Song Lyrics

ఒకని తల్లి ఆదరించునట్లు Lyrics

ఒకని తల్లి ఆదరించునట్లు
నను ఆదరించిన నా దేవుడు (2)
హీనుడనైనా బలహీనుడనైనా
కురూపినైనా కఠినుడనైనా (2)       ||ఒకని||

ఒకసారి నేను నీ మందనుండి
నే తప్పిపోయిన వేళ (2)
నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2)
నీ చంకపెట్టితివా యేసయ్యా (2)      ||ఒకని||

నీ సన్నిధినుండి నే దూరమవగా
చిక్కాను దొంగ చేతిలోన (2)
నను దోచిపోగా నను దాటిపోగా (2)
బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2)       ||ఒకని||

Your favourites

  • No Favourites found!