Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు Telugu Christian Song Lyrics

ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు Lyrics

ఒక్కడే యేసు ఒక్కడే
ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే (2)
మహాదేవుడు మహిమోన్నతుడు
లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||
పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే
పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే (2)
జీవమార్గమై సత్యదైవమై
మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||
అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే
అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే (2)
ఆదరించి ఆశ్రయమిచ్చి
అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||
నిత్యమూ ప్రేమించువాడు యేసు ఒక్కడే
నిత్యా శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే (2)
నీ వేదనలో నీ బాధలలో
నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||
మరణము గెలిచినవాడు యేసు ఒక్కడే
మరల రానున్నవాడు యేసు ఒక్కడే (2)
పరిశుద్దులను ఆ పరమునకు
కొనిపోవువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||

Your favourites

  • No Favourites found!