Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఊహకందని ప్రేమలోని బావమే నీవు  Telugu Christian Song Lyrics

ఊహకందని ప్రేమలోని బావమే నీవు Lyrics

ఊహకందని ప్రేమలోని బావమే నీవు
హృదయమందు పరవసించు గానమే నీవు
మనస్సు నిండిన రమ్యమైన గమ్యమే నీవు
మరపురాని కలల సౌధం గురుతులే నీవు
ఎడబాయలేనన్న నిజస్నేహమే నీవు
నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు

తల్లడిల్లె తల్లికన్న మించి ప్రేమించి
తనువుతీరే వరకు నన్ను విడువలేనంది
అదియే... నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చినప్రేమగా
నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయె
నీ గుండెలో నను చేర్చిన నీ అమరమైన ప్రేమయె 

నింగి నేలను కలిపిన బలమైన వారధిగా
నేలకొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా
అదియే... తన మహిమ విడినత్యాగము
ఈ భువికి వచ్చిన భాగ్యము
నను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే
నీ సర్వమిచ్చిన దాతవు నను హత్తుకున్న స్వామివి 

దేహమందు గాయమైతే కుదుటపడును కదా
గుండెగాయము గురుతుపట్టిన నరుడులేడు కదా
నీవే నీవే యేసయ్యా... నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు
నను భుజముపైన మోసిన అలసిపోనీ ప్రేమవు
నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటు లేనే లేదయ

Your favourites

  • No Favourites found!