Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఊహకు అందని ప్రేమ నా యేసు Telugu Christian Song Lyrics

ఊహకు అందని ప్రేమ నా యేసు Lyrics

ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా
జగాన మారనిది యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ
మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్ధం మూలకారనం
దేవ నీవు ప్రేమించుటకు నీ క్రుపే కారనం
మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం
యేసు ప్రేమ శాస్వతం జీవితానికి సార్ధకం
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ

జీవితమంతా పోరాటం యేదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమకై వెతకటం దొరకకపోతే సంకటం
మనుషులు మారినా మమతలు మారినా
బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ

Your favourites

  • No Favourites found!