Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఊహించలేనయ్యా వివరించలేనయ్యాఎనలేని నీ ప్రేమను నా Telugu Christian Song Lyrics

ఊహించలేనయ్యా వివరించలేనయ్యాఎనలేని నీ ప్రేమను నా Lyrics

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఎనలేని నీ ప్రేమను (2)
నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)
తరియించు వరమే దొరికెను (2)||ఊహించ||
1.నా మనసు వేదనలో – నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను (2)
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను (2)||ఊహించ||
2.నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను (2)
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము (2) ||ఊహించ||

Your favourites

  • No Favourites found!