పాదాలు నేకడుగనా
యేసు పాదాలు నేకడుగనా (2)
కన్నీటితో కడిగి పన్నీరు పూయనా (2)
న్నేలు స్వామికి నా జీవనాధునికి (2)
1. నా పాప భారాన్ని మోసేందుకు
ప్రభువు నా కొరకు లోకాన ఉదయించెను (2)
నరకాగ్ని నుండి నన్ను రక్షించెను (2)
పరలోక భాగ్యము నాకిచ్చెను ||పాదాలు||
2. పాపాల సుడిగాలి పాలైతిని
కడకు శాపాల సంద్రములో పడిపోతిని (2)
నా యేసుప్రేమతో దరిచేర్చును (2)
నూతన జీవము నా కొసగెను ||పాదాలు||
