Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా Telugu Christian Song Lyrics

పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా Lyrics


పాడనా మౌనముగానే స్తుతి కీర్తన
చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2)
యేసయ్యా నీతో సహజీవనము
నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2) ||పాడనా||
ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే
నీ రక్తాభిషేకము కడిగెనే
నా ప్రాణాత్మ శరీరమును (2)
నా విమోచన గానము నీవే
నా రక్షణ శృంగము నీవే (2) ||పాడనా||
దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే
నీ ప్రశాంత పవనాలు అణచెనే
నా వ్యామోహపు పొంగులన్నియు (2)
నా ఓదార్పు నిధివి నీవే
నా ఆనంద క్షేత్రము నీవే (2) ||పాడనా||
నా ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని
నీ తైలాభిషేకము నిండెనే
నా అంతరంగమంతయును (2)
నా మానస వీణవు నీవే
నా ఆరాధన పల్లకి నీవే (2) ||పాడనా||

Your favourites

  • No Favourites found!