పాడేద స్తుతి గానము
కొనియాడేద నీ నామము (2)
నీవే నా ప్రేమానురాగం
క్షణమైన విడువనీ స్నేహం
అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా (2) || పాడేద ||
1. ఇలా నాకేవ్వరు లేరనుకోగా నా దరి చెరితివే
నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు (2)
నీ ఆశాలే నాలో చిగురించెను
నీ వాక్యమే నన్ను బ్రతికించెను (2)
నీ అనుబంధము నాకానందమే (2) || పాడేద ||
2. నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను నే రుధిదారాలే
నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే (2)
నీ చేతులే నను నిర్మించెను
నీ రూపమే నాలో కలిగెను (2)
నీ అభిషేకము పరమానందమే (2) || పాడేద ||
3. బలహీనతలో నను బలపరచి ధైర్యము నింపితివే
నా కార్యము సఫలము చేసి ఆత్మతో నింపితివే (2)
యూదగోత్రపు కొదమ సింహమా
నీతో నిత్యము విజయ (2)
నీ పరిచర్యలో మహిమానందమే (2) || పాడేద ||
