Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పాడుదును క్రీస్తు పేర పదము నెంతో Telugu Christian Song Lyrics

పాడుదును క్రీస్తు పేర పదము నెంతో Lyrics

పాడుదును క్రీస్తు పేర పదము నెంతో వేడుదు నా దివ్యాగురు నివ్విధముఁ
జూడఁజూడ మదిలో నెంతో వేడుకగా మీఱె వింత ఱేడుఁ బోలినవా
డిహ లేఁడు లేఁడందు నహహా ||పాడుదును||

1. పెక్కు పాపములలోన మణఁగి నాదు తక్కువ బుద్ధిచే నందణఁగి దిక్కు
గానక నుండు వేళ దిక్కయి చనుదెంచి మరల గ్రక్కున కరముఁ జూచి
చక్కికిఁ జేర్చి ప్రోచె ||పాడుదును||

2. మోసపు లోక వాంఛలను వట్టి యాశలతోఁ గూడికొన్న కలలు
రోసితిఁ గాన వాని యేసుతోఁ గూడుకొంటి వీసమైనను లేమి లేశము
లేదనుస్వామి ||పాడుదును||

3. పాయ నెన్నటికిని వాసిగాఁ బాస త్రోయను త్రోయను యని చేసెగా
రోయక న న్నావిభుఁడు సాయమై రక్షించు నెపుడు నా యనీతి భయములు
మాని యాయనే జయంజయమని ||పాడుదును||

4. చాలు చాలు పాపమా నీ చెలిమి నిత్య కాలము గలిగించు మృత్యుకలిమి
యేలికైన నాయిమ్మాను యేలు నాయందు దయను మేలిమి
నగుపరచినట్టి జాలినేఁ గంటిఁ గాన ||పాడుదును||

5. ధరలో దేనికి భయపడను ఎట్టి తరుణమైనను చేయి విడను
కరుణామయుండు నన్ను కరుణ నేర్పరచి మున్ను మరణమందును వాని
శరణం నాశరణమని ||పాడుదును||

Your favourites

  • No Favourites found!