పాపమెరుగని పావనాత్ముని
పరిహసించుట న్యాయమా (2)
దోషమెరుగని దీన బాంధుని (2)
దోషి చేయుట ధర్మమా – ధర్మమా ||పాపమెరుగని||
మోయరాని పాప భారము
మోపినారు సిలువపై (2)
గాయమొంది బాధకోర్చి వేదననొంది
ప్రాణమిచ్చుట నేరమా (2) నేరమా ||పాపమెరుగని||
జీవ జలముల త్రోవ చూపి
బ్రోవ నాత్మల దాహమొందె (2)
చావొంది ఆగమై బలి దానమై
జీవమిచ్చుట ఘోరమా (2) ఘోరమా ||పాపమెరుగని||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పాపమెరుగని పావనాత్ముని పరిహసించుట న్యాయమా దోషమెరుగని Lyrics
Your favourites
- No Favourites found!
