Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పాపిని కృప జూపవయ్యా దాపు జేరితిని Telugu Christian Song Lyrics

పాపిని కృప జూపవయ్యా దాపు జేరితిని Lyrics

పాపిని కృప జూపవయ్యా దాపు జేరితిని యేసయ్యా పాప భారము
క్రింద శ్రమపడి కృంగియున్నాను యేసయ్యా ||పాపి||

1. వేష భాషలతోడ నిండి మోసపోయితిని యేసయ్యా దోసిలొగ్గి నిన్ను
చేరితి దాసునిగ బ్రోవు యేసయ్యా ||పాపి||

2. నీతి లేని నాదు జీవిత మేల నికనయ్యా యేసయ్యా నీతి గరపి బ్రోవు
మయ్యా నీతి నిడవయ్యా యేసయ్యా ||పాపి||

3. నీదు సిలువలోని ప్రేమ నెంచదర మౌన? యేసయ్యా నాదు కలుష
మంత బాపి కనికరింపు మా యేసయ్యా ||పాపి||

4. నీదు రక్తధారలేయిల పాపికాశ్రయము యేసయ్యా నీతిమంతుల
జేయుమయ్యా నీతిసూర్యుండా యేసయ్యా ||పాపి||

5. దాపుగోరినవారలకు నీ ప్రాపుజూపితివి యేసయ్యా పాపశాపము బాపి
నిత్య జీవమిడవయ్యా యేసయ్యా ||పాపి||

6. శాంతి గోరువార లెల్లనీ చెంతకరగినచో యేసయ్యా చింతలెల్ల దీర్చగలవు
శాంతి నొసగెదవు యేసయ్యా ||పాపి||

7. పరమరక్షక నీదు ప్రేమ నెరుగ తరమౌన యేసయ్యా పరుల మైన
మమ్ము బ్రోవ వేచియున్నావా యేసయ్యా ||పాపి||

8. నాదు హృదయము నీదెసుమ్మా నీవె గైకొనుమా యేసయ్యా శుద్ధ
హృదయము జేసి నను నీ సుతునిగా జేయు యేసయ్యా ||పాపి||

Your favourites

  • No Favourites found!