Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పాపినినేనని ప్రభుపదములకడ ప్రార్థన సేయుము ఓ Telugu Christian Song Lyrics

పాపినినేనని ప్రభుపదములకడ ప్రార్థన సేయుము ఓ Lyrics

పాపినినేనని ప్రభుపదములకడ ప్రార్థన సేయుము ఓ మనసా పాపుల
మిత్రుడు ప్రభు యేసునికడ పాపక్షమాపణ కలదో మనసా ||పాపిని||

1. నరుని స్వనీతిచే దొరుకదు మోక్షము నరులను జూడకు యో మనసా
ధరనొక పుణ్యుడు దరచినలేడని పరమవేదములో గలదో మనసా
||పాపిని||

2. జపతపములు మరి యుపవాసములును ఉపయోగింపవు ఓ మనసా
నెపముల జెప్పెడు అపవాదిని విడి కృపవాదినిగని బ్రతుకో మనసా
||పాపిని||

3. మానని ప్రేమచే మనుజుల బ్రోవగ మానవుడయ్యెను ఓ మనసా మానుగ
గల్వరి మ్రానిపై యేసుడు ప్రాణము నొసగెను ఓ మనసా ||పాపిని||

4. మరణము నొందియు మరల సజీవుడై మనుజుల కగుపడెనో మనసా
మరణ బంధముల బరిమార్పిన ప్రభు సరిరక్షకు లిక లేరిల మనసా
||పాపిని||

5. మార్పును బొందక మలిన తరుణము మరల లభింపదు ఓ మనసా
తీర్పుకాలమున తీర్పరి క్రీస్తని తిరముగ నమ్ముము యేసుని మనసా ||పాపిని||

Your favourites

  • No Favourites found!