Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పావనుడా మా ప్రభువా నీ రక్షణకై Telugu Christian Song Lyrics

పావనుడా మా ప్రభువా నీ రక్షణకై Lyrics

పావనుడా మా ప్రభువా - నీ రక్షణకై స్తోత్రములు
నీ రక్షణకై స్తోత్రములు
1. అత్యున్నతమైన దేవా - సింహాసనాసీనుడవు
ఎంతో గొప్పది నీ మహిమ - వర్ణింపజాలను నేను
2. పాపపు కుష్ఠుతో పడి చెడిన - ఈపాపిని కరుణించితివి
నా పాపపు డాగులు కడిగి - పరిశుద్ధుని చేసిన విభుడా
3. అపవిత్రమగు పెదవులతో - కపటముగా జీవించితిని
అపరాధి నోటిని తెరచి - స్తుతి గీతము నొసగిన ప్రభువా
4. నీ క్రయధన మధికము ఎంతో - నా కర్త నిను ప్రణుతింతు
నా కందరి కంటె ఘనుడా - ఓ కల్వరి నాథా యేసు
5. మహిమ పరతును ప్రభు యేసు - మహదానందముతో నిరతం
మహోన్నతుడా ప్రభు నిన్ను - మహిమలో ఆరాధించెదను
6. నా కనులతో నిను చూచెదను - ఆకసమున దూతల మధ్య
రక్షక త్వరగా రారమ్ము - అక్షయుడా నీకే స్తుతులు


Your favourites

  • No Favourites found!