Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పావురమా నీ ప్రేమ ఎంత మధురము Telugu Christian Song Lyrics

పావురమా నీ ప్రేమ ఎంత మధురము Lyrics

పావురమా నీ ప్రేమ ఎంత మధురము
పావురమా నీ మనసు ఎంత నిర్మలము
జుంటి తేనె ధార కన్నా
మంచి గోధుమ పంట కన్నా (2)
ప్రేమ మధురము – నీ మనసు నిర్మలము (2)
నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము
నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము

కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను
ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2)
ఎటు చూసిననూ ఎం చేసిననూ
మదిలో నిన్నే తలంచుచున్నాను (2)
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా (2)      ||నా యేసయ్యా||

దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు
పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2)
నా వాడు నా ప్రియుడు
మదిలో నిన్నే తలంచుచున్నాడు (2)
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా (2)      ||నా యేసయ్యా||

Your favourites

  • No Favourites found!