పాడనా స్తోత్ర కీర్తనా
పాడనా హృదయాలాపనా (2)
కలువరిలోన కరుణామయుని (2)
పయనమును పాడనా
వేదన విలపించనా (2)
వేదన విలపించనా….
ప్రేమమయుడా కలువరినాధా
నీ గాయముల్ వర్ణించుట నా తరమౌనా (2)
|| పాడనా ||
1. పిడికిలితో గుద్దిరీ ప్రభుని ఒంటరి చేసి
ముఖము పై ఉమ్మిరీ చెళ్ళుమని కొట్టిరి దేవా…(2)
బాధతో నా ప్రభువు కుమిలిపోయేనే (2)
మనకై వేదన సహియించేనే
కరుణామయూడా కృపగల దేవా
నీ యోగ్యత వర్ణించుట నా తరమౌనా (2)
|| పాడనా ||
2. గాలాలతోనే అల్లిన కొరడా ప్రభు దేహము చేల్చెను
నీ దివ్య రూపం చిదిమింది నేనే
నా అంధకారం మోసింది నీవే (2)
పారింది రుధిరం ఈ లోక రక్షణకై …(2)
నే మోస్తూ బ్రతికేది నీ వార్త భారం
సిలువ దారుడా వాక్యనాథుడ
నీ నెరవేర్పు వర్ణించుట నా తరమౌనా (2)
|| పాడనా ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పాడనా స్తోత్ర కీర్తనా పాడనా హృదయాలాపనా  కలువరిలోన Lyrics
Your favourites
- No Favourites found!
