పదరే సోదరులార పమ్మపురిఁజేర మధుర జీవాధార పదవిచేకూర
తుది మొదలును ఆపద రేబగలు లేని సదనంబునకు జేర సదయు
డేసునిఁ గూడి ||పదరే||
1. ఎన్ని దినములు బ్రతుకు నేమి సౌఖ్యంబు అన్ని విధముల జూడ నధిక
కష్టంబు కన్ను మూసిన నాఁడు మన్ను పాలౌదుము మున్ను జాగ్రత్తనొంద
కున్న నష్టము గల్గుఁ ||బదరే||
2. ధరణి బ్రతుకును గోర మరణ భయంబు దరీలేని చింతలఁ దగిలి
నిత్యంబు పరి పరి విధముల పరుగు లెత్తుట లేల నిరతంబును సువార్త
సరణిఁ గన్గొని వడిగఁ ||బదరే||
3. ధనము సంపాదించి ఘన మదిక మున్న తనువే సతము గాదు అను
భవము సున్న ఇనుఁ డెంద మావు లను గోర నేపాటి తనివి దీరు నిచ్చో
టను నా పాటే దీరుఁ ||బదరే||
4. పరలోక మార్గం బిరుకై గన్పడును జొరగా సంకటములు నెరిజుట్టుకొనును
పరమ జనకుని కృపా వరము తోడుగ నున్న వెరపు నొంద మింక
సరకు సేయుము పద ||బదరే||
5. ఇహ స్నేహముల మన కిఁకజాలుఁ జాలు బహు దినంబులు సేయంఁ
బడె నేమి మేలు మహిమ దూతల స్నేహ మమరు నచ్చట మనకు
అహహా యేసుని జూడ నధిక సంతోషంబు ||పదరే||
6. మనల తోడ్కొని పోవ ఘనుఁడు యెహోవా యనంబు తన శుద్ధా
త్మను నిచ్చి కావ నెనలేని యడ్డంకు లను దాఁటింపను గృప గనుపర్చి
తోడుగ నునిచె వేగము గూడి ||పదరే||
7. భక్తులై యున్నట్టి బంధు మిత్రాడుల రక్తి గుణముతో రంజిల్లఁ
గనినన్ ముక్తి రాజ్యంబుల మురువుతోడ సర్వ శక్తుని మహిమ నా
సక్తితోఁ జూతము ||పదరే||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పదరే సోదరులార పమ్మపురిఁజేర మధుర జీవాధార Lyrics
Your favourites
- No Favourites found!
