Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పదివేలలో అతిప్రియుడుసమీపించరాని తేజోనివాసుడుఆ మోము వర్ణించలేముస్తుతుల Telugu Christian Song Lyrics

పదివేలలో అతిప్రియుడుసమీపించరాని తేజోనివాసుడుఆ మోము వర్ణించలేముస్తుతుల Lyrics

పదివేలలో అతిప్రియుడు
సమీపించరాని తేజోనివాసుడు
ఆ మోము వర్ణించలేము
స్తుతుల సింహాసనాసీనుడు
నా ప్రభు యేసు (4)
ఏ బేధము లేదు ఆ చూపులో
ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2)
జీవితములను వెలిగించే స్వరం
కన్నీరు తుడిచే ఆ హస్తము (2)
అంధకారంలో కాంతి దీపం
కష్టాలలో ప్రియనేస్తం (2)
నా ప్రభు యేసు (2) ||పదివేలలో||
దొంగలతో కలిపి సిలువేసినా
మోమున ఉమ్మి వేసినా (2)
తాను స్వస్తపరచిన ఆ చేతులే
తన తనవును కొరడాలతో దున్నినా (2)
ఆ చూపులో ఎంతో ప్రేమ
ప్రేమామూర్తి అతడెవరో తెలుసా (2)
నా ప్రభు యేసు (2) ||పదివేలలో||

Your favourites

  • No Favourites found!