పల్లవరపు కొండలపైన
ప్రభుదాసులు ప్రార్థింపగను
ఆహా పౌలుకు చూపిన రీతిన్ |
పరలోక సంఘదర్శనమిచ్చెన్ |(2)
అను తొలిప్రేమ కలిగి అందరము |
బలియైన క్రీస్తును ప్రకటించి |(2)
మారాను పోలిన శ్రమలున్నా |
కానాను పురముకు చేరుదము |(2)
1. అపొస్తలుల బోధ - సహవాసము ప్రభు బల్ల
ప్రార్థన జీవితము - సంఘ దర్శనమునకు మూలం
ఈ ఆత్మీయ లంగరులను కలిగి - కొనసాగెదము తుఫానులలో
ఈ ఆత్మీయ లంగరులను కలిగి - ఈ పాప సముద్రము దాటెదము
2. విశ్వాసము ప్రేమ - నిరీక్షణ నిలుచునిల
అపకారము మాని - డంబమును విడచెదము
సోదర ప్రేమలేనిచో - వ్యర్థులము మన మీ లోకములో
సోదర ప్రేమలేనిచో మ్రోగెడి తాళము వలె నుండెదము
3. దేవుని చిత్తమును - ఎరిగి జీవించెదము
ప్రభు చిత్తము కొరకు - చెల్లించెదము క్రయము
దేవా నీ చిత్తము నెరవేర్చ - మాకెంతో సంతోషము
దేవా నీ చిత్తము నెరవేర్చ - నీకెంతో సంతోషము
4. దేవుని మందిరమున్ - ప్రేమించెదమెల్లప్పుడు
దేవుని వాక్యమును - ఆలయములో ధ్యానింతుము
చిరకాలము దేవుని మందిరములో - నివసించి స్తుతియించెదము
చిరకాలము దేవుని మందిర తేజో మహిమలో వసియించెదము
5. ఆత్మతో సత్యముతో - నిజ ఆరాధన కలిగి
యధార్థ హృదయముతో - మంచి సాక్ష్యమును కలిగి
పెదవుల పదములు కాదని - మన హృదయములను అర్పించెదము
పెదవుల పదములు కాదని - హెబ్రోను ప్రభుని కొనియాడెదము
6. చెప్పనశక్యమును - మహిమా యుక్తమునైన
సంతోషము కలిగి సువార్తను చాటెదము
ఆకాశము క్రింద ఏ నామమున - రక్షణ లేదని చాటెదము
ఆకాశము క్రింద యేసు నామమునే - పాపక్షమాపణ కలుగునని
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పల్లవరపు కొండలపైన ప్రభుదాసులు ప్రార్థింపగను ఆహా Lyrics
Your favourites
- No Favourites found!
