Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పలుకలేని నాకు పాట నేర్పినావు చేతకాని Telugu Christian Song Lyrics

పలుకలేని నాకు పాట నేర్పినావు చేతకాని Lyrics


పలుకలేని నాకు పాట నేర్పినావు
చేతకాని నన్ను నీవే ఎన్నుకున్నావు
మనిషిగా మలచావు – ప్రేమతో పిలిచావు (2)
యేసయ్యా స్తోత్రమయా
యేసయ్యా స్తోత్రమయా         ||పలుకలేని||

కోడి తన రెక్కల క్రింద దాచినట్లు దాచినావు
నా తల్లి మరచినా నేను మరువనన్నావు (2)
ప్రతి ఉదయం వేకువనే
ఎదురు చూచు ప్రియుడవు నీవు (2)
ప్రతి క్షణము కాపరివై
కాయుచున్న దేవుడ నీవు (2)         ||యేసయ్యా||

అగాధ జలములు సైతం ఆర్పలేని ప్రేమ నీది
వెండి బంగారు కన్నా విలువైన ప్రేమ నీది (2)
ప్రతి పగలు మేఘమై
నీడనిచ్చుఁ దేవుడ నీవు (2)
ప్రతి రాత్రి దీపమై
వెలుగునిచ్చుఁ దేవుడ నీవు (2)         ||యేసయ్యా||

Your favourites

  • No Favourites found!