Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరదేశులమో ప్రియులారా మన పురమిది గాదెపుడు Telugu Christian Song Lyrics

పరదేశులమో ప్రియులారా మన పురమిది గాదెపుడు Lyrics


పరదేశులమో ప్రియులారా మన
పురమిది గాదెపుడు (నిజముగ) (2)        ||పరదేశుల||

చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి
చిత్రమైన సంత (లోకము) (2)        ||పరదేశుల||

సంత గొల్లు క్షమ సడలిన చందం
బంతయు సద్దణగన్ (నిజముగ) (2)        ||పరదేశుల||

స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని
బరలోకమే స్థిరము (నిజముగ) (2)        ||పరదేశుల||

మేడలు మిద్దెలు మేలగు సరకులు
పాడై కనబడవే (నిజముగ) (2)        ||పరదేశుల||

ధర ధాన్యంబులు దరగక మానవు
పని పాటలు పోయె (నిజముగ) (2)        ||పరదేశుల||

ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన
మన్నై పోవునుగా (దేహము) (2)        ||పరదేశుల||

వచ్చితి మిచటికి వట్టి హస్తముల
దెచ్చిన దేదియు లే (దు గదా) (2)        ||పరదేశుల||

ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు
అట్లు వెళ్ళవలయున్ (మింటికి) (2)        ||పరదేశుల||

యేసు నందు విశ్వాసం బుంచిన
వాసిగ నిను జేర్చున్ (బరమున) (2)        ||పరదేశుల||

యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవముగా (నిజముగ) (2)        ||పరదేశుల||

Your favourites

  • No Favourites found!