Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరలోక రాజ్యము చేరుటకు ప్రభుయేసే మార్గంబు Telugu Christian Song Lyrics

పరలోక రాజ్యము చేరుటకు ప్రభుయేసే మార్గంబు Lyrics

పరలోక రాజ్యము చేరుటకు - ప్రభుయేసే మార్గంబు
మార్గ సత్య జీవము నేనేయని యేసే పల్కెను
1. సర్వలోకుల పాప - పరిహారార్థము శ్రీ యేసు
పరిశుద్ధ రక్తము చిందించి - బలియాయెను శ్రీ యేసు
2. పాపపరిహారార్థము - పావన రక్తము నిచ్చిన
యేసుని చేర ప్రియుడా - సంశయమదియేల
3. నిను ప్రేమించి ప్రాణము - నీకై పెట్టిన యేసుని
నాకు వలదంచు వెళ్ళుట - న్యాయమా ప్రియుడా
4. మరణించిన యేసు ప్రభువు - మూడవనాడు లేచెను
మహిమా ప్రభావముతో యేసు - మరణము గెల్చెను
5. తక్షణమే మారు మనస్సు - నొంది యేసును నమ్మిన
రక్షణ నొందెదవు - నిశ్చయముగనో - ప్రియుడా


Your favourites

  • No Favourites found!