Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరలోకము నా దేశము పరదేశి నేనిల Telugu Christian Song Lyrics

పరలోకము నా దేశము పరదేశి నేనిల Lyrics

పరలోకము నా దేశము
పరదేశి నేనిల మాయలోకమేగ
నేను యాత్రికుడను (2)

ఎంతో అందమైనది పరలోకము
అసమానమైనది నా దేశము (2)
ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2)          ||పరలోకము||

దూతలు పాడుచుందురు పరమందున
దీవా రాత్రమునందు పాడుచుందురు (2)
పావనుని చూచి నేను హర్షింతును నిత్యము (2)          ||పరలోకము||

రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్
వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని (2)
కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ (2)          ||పరలోకము||

అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్
అగుపడుచున్నది గమ్యస్థానము (2)
అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్ (2)          ||పరలోకము||

నిత్యానందముండును పరమందున
నీతి సమాధానము ఉండునచ్చట (2)
పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి (2)          ||పరలోకము||

Your favourites

  • No Favourites found!