Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు Telugu Christian Song Lyrics

పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు Lyrics

పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు ననుచుఁ బరమ
గురువు యేసు క్రీస్తు స్థిరము చేసెను ||పరమ||

1. వేదశాస్త్ర మెఱిఁగినట్టి యూదుల యధికారియౌ ని కోదే మనెడు
పరిసయుండు మదిని దలఁచుచున్ ||పరమ||

2. అతఁడు రాత్రివేళఁ ప్రభుని వెతకి పోయి యెదుట స మ్మతిని నిలిచి
పిలిచి పల్కె హితవుతోడను ||పరమ||

3. బోధకుండ నీవు మోక్ష నాధుఁడౌ యెహోవ యొక్క వేద వార్తఁ జెప్పెదవు
నీ బోధ నెఱుఁగుదున్ ||పరమ||

4. మఱియు నీవు చేయుచున్న గురుతు లెవ్వరైన దైవ వరము లేని యట్టి
పాప నరులు చేయరు ||పరమ||

5. అనుచుఁ బరిసయుండు పల్క వినుచు యేసు కనికరమునఁ దనకు
నిట్లు దెలిపెఁ జాలి మనసుతోడను ||పరమ||

6. క్రొత్త జన్మ మెవ్వఁడైన నెత్త కున్న మోక్షమమునకు నెత్తఁబడఁ డటంచు
నిజము క్రీస్తు పల్కెను ||పరమ||

7. వినుచుఁ బరిసయుండు ముసలి జనుఁడు మఱల తల్లి గర్భ మునను
తిరుగనెట్లు బుట్టు ననుచుఁ బల్కెను ||పరమ||

8. అందు కేసు తెల్పె జలము నందుఁ నాత్మయందు జన్మ మొంద కున్న
మోక్ష రాజ్య మొంద రనుచును ||పరమ||

Your favourites

  • No Favourites found!