పరమ రక్షక యేసు ప్రభువా నే నీ పాలఁ పడితి పాలన సేయవే
ధరజనంబులుసేయు బహువిధ దురితములు క్షమియించి సద్గతి తెరవు
జూపి తరింపఁజేసెడి దొరవటంచును మరుగుజోచ్చితి ||పరమరక్షక||
1. క్షితి నబ్ధి తీర పై కతయైన నెన్ననా యితియౌను లెక్కింపఁగా
కుతల జన్మంబెత్తియేనిట బ్రతుకు దినముల జేయునఘములు మతి
దలపనిమితా యుతంబులు పతితు డనునాగతి యెరుంగను ||పరమరక్షక||
2. పసలేని మాయా దు ర్వ్యసనంబులను జెంది దెసదప్పి యున్నాఁడను
వసుధలో దుష్టునికి లోఁబడి మసలజాలని బలహీనత గసటు కన్నులగప్పి
కడు మా నసము దూలి విలాపినైతిని ||పరమరక్షక||
3. మదితప్పి గొఱ్ఱెల మంద బాసినగొఱ్ఱె చెదరి చలించినట్లు వదలకెపుడు
దురాత్మలైరి స ముదయమునఁ బడితిరిగి వడిచెడి మదికి విశ్రమమేమి
లేమిని హృదయ సంతాపముల సుడిఁబడి ||పరమరక్షక||
4. మదపున్నాగము భంగి మత్తిల్లి దుర్భావ హృదయుఁడనై చెడితిని
గొదగొనుచు గాయములతో నా యెద దృఢంబించుకయు లేమినిఁ గదల
శక్యము గాక మూల్గుచు గొదువలకు లోనైతి ద్రోహిని ||పరమరక్షక||
5. అమిత దురాత్ముఁడ నని కడఁ ద్రోయక క్షమియింపు మీ కరుణచే
తమిని మిక్కిలి దుర్విషయగుణ సముదంబులు జుట్టి పాపపు తమము గప్పియు
గలుషకానన సమితిలోఁబడి శ్రమలు నొందుచు ||పరమరక్షక||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పరమ రక్షక యేసు ప్రభువా నే Lyrics
Your favourites
- No Favourites found!
