పరమ తండ్రి నిన్ను మే మీ పరస కాలము స్వరము లెత్తి యింపు
గాను స్మరణఁ జేతుము ||పరమ||
1. నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో హరువుగా నుతింతు మేము
హర్స రవముతోఁ ||పరమ||
2. అవని సంభ్రమములలోన నవఘళించము అవసరముగ నీదు పలుకు
నవధరింతుము ||పరమ||
3. వేయి నాళ్లు లోకమునను వెలయుకంటెను శ్రేయ మొక్కనాఁడు నిన్ను
సేవ జేయుట ||పరమ||
4. ఉచితమైన నీ గృహమున నచల భక్తితో రుచిరమైన నీదు ప్రేమ
రుచినిజూతుము ||పరమ||
5. మనసునందు సత్యబోధ మనస్కరించుచు మనెడు తరిని విడము నీదు
ఉనికిపట్టును ||పరమ||
6. గొరియ పిల్ల యొక్క ప్రేమ గూర్చి భక్తితోఁ గొరత లేక చేతు మెపుడు
గొనబు గానము ||పరమ||
7. శాంతజలము నొద్ద మమ్ము శాంతి పరచుము సంతతమును నీవు
మమ్ము సంతరించుము ||పరమ||
8. దినము లన్ని మేము నిన్ను దీన మనసుతో వనరు మాని సంతసమున
వినతి చేతుము ||పరమ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పరమ తండ్రి నిన్ను మే మీ Lyrics
Your favourites
- No Favourites found!
