పరమ వైద్యుఁడ భారతీయుల వ్యాధి బాధలఁ బాపుమా పరుల కుపచారం
బొనర్చుట పరమ విధియని చూపుమా ||పరమ||
1. ప్రేమతో వైద్యులును దాదులు పెంపుఁ బొందఁగజేయుమా గ్రామ
రోగులఁ గాంచి వారికి క్షేమమును దయ చేయుమా ||పరమ||
2. భరత ఖండము నందు వైద్యపు బడులను నెలకొల్పుమా పరఁగ నీవే
వైద్య శాలలఁ బాలనంబు సల్పుమా ||పరమ||
3. కుఁటి గ్రుడ్డి మూఁగ సాలలఁ గూర్మితో దర్శించుమా యంటు రోగుల
యాశ్రయముల నంటి పరామర్శించుమా ||పరమ||
4. లెక్కలేని గర్భవతుల యక్కఱలను దీర్చుమా దిక్కు లేని బిడ్డలకు నీ
దీవెనల సమకూర్చుమా ||పరమ||
5. యంత్రశాలల గనులయందు నలయు వారలం బ్రోవుమా మంత్ర
తంత్రము లందుఁ జిక్కు న మాయకులను గావుమా ||పరమ||
6. గ్రామ వైద్య సేవఁ జేసెడి ఘనులఁ బరిపాలించుమా గ్రామవాసులఁ
గూల్చు వ్యాధులఁ గాంచి నిర్మూలించుమా ||పరమ||
7. దురభిమాన మూఢ భక్తిని ద్వరగ దూర పరచుమా మరియు శుచిచే
రోగములు మటు మాయ మగు నని కరపుమా ||పరమ||
8. దేహశుద్ధిని జిత్తశుద్ధిని దేశ జనులకుఁ గూర్చుమా దేహములఁ బర శుద్ధ
మగు నీ దేవళములుగ మార్చుమా ||పరమ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పరమ వైద్యుఁడ భారతీయుల వ్యాధి బాధలఁ Lyrics
Your favourites
- No Favourites found!
