Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరమతండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము శిరములెత్తి Telugu Christian Song Lyrics

పరమతండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము శిరములెత్తి Lyrics

పరమతండ్రి కరములెత్తి - స్తుతుల నర్పింతుము
శిరములెత్తి స్వామి నీకై చూచుచుంటిమి
ఉజ్జీవ నాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగ
1. పాప శాపములందు మేము - పడి చెడి యుండగా
దేవ మాదు దరికి జేరి - లేవ నెత్తితివి
ఎంత జాలి ఎంత ప్రేమ - స్తుతుల నర్పింతుము
2. దినదినము నిను శోధించి - దుఃఖ పెట్టితిమి
కేవలము శరీరులమని - కనికరించితివి
క్షమించి మమ్ము కడిగితివి - స్తుతుల నర్పింతుము
3. నింద వేదన శ్రమలు బహు - నిట్టూర్పులయందు
విసుగకుండ సేవచేయ - నొసగు నోర్పును
నింపు నీ శుద్ధాత్మతోను - స్తుతుల నర్పింతుము
4. సూర్యచంద్ర తారలందు - వింత సూచనలు
జరుగ జనులు ధైర్యము చెడి - కూలి చూచెదరు
అయితే నీకై చూచు మేము - బలము నొందెదము
5. సమాజముగ కూర్చి నీదు - సన్నిధియందు
ప్రార్థన సహవాసములలో - స్థిరులజేయుము
తేరి చూస్తూ నీ రాకడకై - స్తుతుల నర్పింతుము
6. శత్రుటురులు త్రుంచివేసి - జీవమిచ్చితివి
ఆహా! యేమర్పింతుము - నీ ఉపకారములకై
చేతబట్టి రక్షణపాత్ర - స్తుతుల నర్పింతుము
7. గతబ్రతుకులో వాత్సల్యమున - గాచి యీ క్షితిన్
నడిపె నవ్యవత్సరముకై - కృపాక్షేమములతో
సత్యుడ సిల్వశక్తి నొసగు - సాగముందుకు


Your favourites

  • No Favourites found!