Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరిమళతైలం నీవే తరగని సంతోషం నీలో జీవనమకరందం నీవే తియ్యని Telugu Christian Song Lyrics

పరిమళతైలం నీవే తరగని సంతోషం నీలో జీవనమకరందం నీవే తియ్యని Lyrics

పరిమళతైలం నీవే
తరగని సంతోషం నీలో
జీవనమకరందం నీవే
తియ్యని సంగీతం నీవే

తరతరములలో నీవే
నిత్యసంకల్పసారథి నీవే
జగములనేలే రాజా
నాప్రేమకు హేతువు నీవే  ||పరిమళ||

1. ఉరుముతున్న మెరుపులవంటి
తరుముచున్న శోధనలో (2)
నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు
క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు
నీ మనసే అతి మధురం
అది నా సొంతమే  ||పరిమళ||

2. చీల్చబడిన బండనుండి
నా కొదువతీర్చి నడిపితివి
నిలువరమగు ఆత్మ శక్తి తో
కొరతలేని ఫలములతో
నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకొంటివి
నీ స్వాస్థ్యములో నే చేరుటకై అభిషేకించినావు
నీ మహిమార్థము వాడబడే
నీ పాత్రను నేను ||పరిమళ||

3. వేచియున్న కనులకునీవు కనువిందే చేస్తావని
సిద్ధపడిన రాజుగ నీవు నాకోసం వస్తావని
నినుచూసిన వేళ నాలో ప్రాణం ఉధ్వేగభరితమై
నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై
యుగయుగములలో నీతో
నేను నిలచిపోదును ||పరిమళ||

Your favourites

  • No Favourites found!