పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని వినఁ బడు పుర మదిగో పద
పదరే ప్రియులారా పరమేశ్వరుని చేతఁ బరిపాలనముఁ గల్గి చిరమై
భాసురమై సు స్థిరమై సుందరమైన ||పరిశుద్ధి||
1. రవితోను కుముదబాం ధవుతోను మఱి దీప చ్ఛవితోను దాని కవ
సర మింతలేదు అవిరతమునఁ గ్రీస్తుఁ డందుండుఁ ప్రభతో సం
స్తవమై వైభవమై యు త్సవమై వెల్గుచు నుండుఁ ||పరిశుద్ధి||
2. గొదయైన మఱియే యా పదయైన దగయైన మొదలే లేకుండు న
ప్పుర వాసు లందు మృదు జీవోదకము ల ర్మిలి నిరంతర మిచ్చు
గుదురుగ నెదురుగఁ గూర్చుండి యువరాజు ||పరిశుద్ధి||
3. ప్రభు కృపాసనములో పలినుండి ప్రవహించి శుభమైన నది యుండి
సుఖమిచ్చు నచట నుభయ తీరములందు నుండు వృక్షములు సౌ
రభదీప్త శుభములై రక్షా ఫలము లిచ్చు ||పరిశుద్ధి||
4. జననంబు మరణంబు సంసార సుఖబాధ లనుభవించుట గల్గ దా
పురమునందు మును నీతి కొఱ కాప దను బొందు తనవారి కనునీ
ళ్లన్నియు దుడుచు మన దేవుఁ డందుండి ||పరిశుద్ధి||
5. వెలకంద రాని ని శ్చలమైన ఘన జీవ విలపత్కిరీటము ల్గల వప్పుర
మునఁ బిలిచి నప్పుడె విభుని పెండ్లి విందున కేగు కుల బంధువులకు
ని చ్ఛల నిచ్చు దేవుఁడు ||పరిశుద్ధి||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని వినఁ Lyrics
Your favourites
- No Favourites found!
