Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము పరము Telugu Christian Song Lyrics

పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము పరము Lyrics

పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము
పరము నుండి వచ్చుట చూచితిని
భర్త కొరకు అలంకరింపబడిన
పెండ్లి కుమార్తెగా చూచితిని
1. సింహాసనమందు గొప్ప శబ్దముతో
బలముగ పలికిన స్వరము వింటిన్
దేవుడు నివసించు మానవులతో
తానే వారితో సదా వసించున్
2. దేవుడు తానే వారితో నుండి
ఆయన వారికి తండ్రియగును
ప్రతి బాష్పబిందువుల తుడిచివేయున్
మరణము దుఃఖము ఏడ్పు నిక నుండదు
3. మొదటి సంగతులు గతించు చుండె
పరికించుము సర్వము క్రొత్తవాయె
సింహాసన మందుండి ప్రభువే పలికె
నూతనముగా నే చేసితి ననెను
4. ఈ వాక్యము విశ్వాసులకు యోగ్యము
సత్యమై మారనిదై యుండు నెప్పుడు
ఆది యంతము అల్ఫా ఓమేగ
దప్పి గొన్న వానికి జలము లిచ్చున్
5. జయించువారు వీటన్నింటిని
వారసులై స్వతంత్రించు కొందురు
ఆయన వారికి దేవుడై యుండి
వారాయనకు పుత్రులవుదురు


Your favourites

  • No Favourites found!