పరిశుద్ధ ప్రభు యేసు - స్తుతి స్తోత్రం
నన్ను రక్షించినట్టి - నా ప్రభువా
1. గొప్ప దేవుడవని - నే నెరిగితిని
తప్పకుండ నీ నామము - స్మరియింతును
2. తండ్రివైతివి నీవు - పరమునందు
దండి ప్రియుదవు నీవు - నా రక్షకా
3. బహు విశ్వాస హీనుడ - నగు నాకు
మహా ప్రభువై నన్నున్ - మోసెదవా!
4. సజీవుడవైన - విమోచకుడా
ఉజ్జీవము నొసగి - లేపితివే
5. మంచి కాపరి నీవే - మా యేసు ప్రభూ
కొంచెమైనను కొదువ - లేదికను
6. పరలోక ప్రధాన - యాజకుడా
ఏ రీతిగా నిను నే పూజింతును?
7. పరలోకములో నుండి - వరుడేసు
అరుదెంచు నాకై - హల్లెలూయ
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం Lyrics
Your favourites
- No Favourites found!
