పరిశుద్ధ శ్రీ యేసువే - పరలోకరాజు
మురియుచు నే పూజింతును - నిరతము
అను పరలోక మహిమనుండి - నరుల రాజ్యములలో
నిరతము తన పాలనము జరిగించుచున్నరాజు
1. పెనూయేలు పోరాటంబున - పోనివ్వనంచు
పెనుగునందున యాకోబు - వినయమున
నన్ను దీవించు తండ్రీ - నిన్ను నే విడువనంచు
కన్నీటితో వేడగా - ఘనత ఇశ్రాయేలనియె
2. ఈ దినమున నుండి - పదిలముగ
ముదముగ దీవింతుననెన్ - ఆదరణకర్త
తుదిమందిర పునాదిపై - కదలక నిలుచువారిన్
కదలని నా పునాది - యూదాగోత్ర సింహంబు
3. సీయోనులోనుండి - ప్రియుడైన యేసు
కాయుచు నిను దీవించును - ఆయన త్రోవన్
పాయక నిన్నెప్పుడు - పరిపాలించు చుండును
రయమున నిన్ను జేరి - సాయంబు చేయుచుండున్
4. జయించుచున్న వానికి - మరుగైన మన్నా
ప్రియమున భజియింపనిచ్చున్ - జయశాలి
వ్రాయబడిన క్రొత్తనామ మున్నట్టి తెల్ల
రాయినొసంగి వాని భయము తొలగించు జయము
5. నడిపించుచుండి నిత్యము - తన దృష్టి నిలిపి
విడువకుండగ నీ ప్రభు - కడవరకు
ఎడతెగని తనదు ప్రేమ - కనుపరచి తృప్తిపరచి
చెడుగునెల్లను బాపి - తన యడుగు జాడలలో
6. బలము నారోపించుము - బలమిచ్చు ప్రభువు
సిలువలో నీకై సమసెను - సీయోను
గెలిచె సమాధినుండి - బలముతో తిరిగిలేచె
ఎల్ల మేలుల తలచి - హల్లెలూయ పాడెదము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పరిశుద్ధ శ్రీ యేసువే పరలోకరాజు మురియుచు Lyrics
Your favourites
- No Favourites found!
