Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం బయిన యా Telugu Christian Song Lyrics

పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం బయిన యా Lyrics

పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం బయిన యా పరమ కానానున
కరుగున దెపుడో ||పరిశుద్ధం||

1. పరిశుద్ధమయిన యా యెరుషలేము పురము వర పద్మరాగంపు స్ధిర
పునాదులతోడ పరిఢవిల్లు సువర్ణ ప్రహరియు గోడలు నురురత్న ద్వారంబు
లదిరిగ గల వహహ ||పరిశుద్ధం||

2. ఆ నీతిపురమున నాకాశమున వెల్గు భానుండు శశి కానఁ బడఁ
బోవు దేదీప్య మానంబై విలసిల్లు మానిత గొఱ్ఱియ దానికి జ్యోతియై
తనరుచుండు నహహ ||పరిశుద్ధం||

3. శృంగారమైనట్టి బంగారు వీధులలో చెంగు చెంగున దాఁటు శ్రేష్ట
సమయంబున మంగళ ప్రదమైన మహిమ రాజ్యమునందు రంగైన
ప్రభుయేసు రాజున్ దర్శింతును ||పరిశుద్ధం||

4. తళతళ మెఱసెడు ధవళంపు టంగీలు కళ లీనుచుండంగ గాళ్లార
ధరియించి భళిర భళిర యంచు భక్తాళితో నెపుడు నెళవుగా నుందుము
నిజ రక్షకుని చెంత ||పరిశుద్ధం||

5. భూరి వీణెలు చేతఁ బొల్పుగ ధరియించి సారెకు మీటుచు సంగీత
ములు బాడి శ్రీ రాజా నీకు జో హారంచు ప్రభు యేసు పేరఁ గీర్తింతురు
ప్రియ భక్తులందఱు ||పరిశుద్ధం||

6. కరములు జోడించి శిరముల్ క్రిందికి వంచి వరపీటమును జుట్టి
తిరుగు దూతలఁగూడి పరిశుద్ధం పరిశుద్ధమని నేను పరమ
సంగీతంబు బాడుచుండెద నాహా ||పరిశుద్ధం||

Your favourites

  • No Favourites found!