Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో Telugu Christian Song Lyrics

పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో Lyrics

పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో నరుదెంచుమా
పరిశుద్ధుడగు యేసు పరమున కరిగి యా దరణకర్తగ నిన్ను దయచేసె
గద మాకు ||పరి||

1. తండ్రి కుమారాత్మల యేకాత్మవై యుండిన పావనుడా నిండార నీ
యాత్మ నండగ మాకొసగి దండిగ వరముల దయచేయు మోదేవ ||పరి||

2. విధిగ వేదము జదివిన వేమారుసద్బోధల నాలించినా సదయుడ నీ
శక్తి హృదయాల లేకున్న కదలింపబడలేని కలుషాత్ములము తండ్రి ||పరి||

3. సత్యస్వరూపా రమ్ము మమ్ముల సర్వ సత్యములో నడుపుము సత్యాత్మా
నీ శక్తి సంపత్తితో దైవ కృత్యము లొనరింప గ్రుమ్మరింపుమా శక్తి ||పరి||

4. వాక్యమందలి భావముల్ లోతుగ దరచి వచియింప దరమె మాకు
వాక్యోప దేశివిగా వచ్చి మాలో నిలచి వాక్యమందలి జీవ భావాలు
దెలుపుమా ||పరి||

5. సాధక బాధకముల నిలయంబైన సంసార సాంద్రములో ఆదరణ
కర్తవుగా నరుదెంచి మా సర్వ బాధల దొలగించి మోదంబు గూర్చుమా
||పరి||

Your favourites

  • No Favourites found!