Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరిశుద్ధాత్ముడా నీకే వందనం ఆదరణ కర్తా Telugu Christian Song Lyrics

పరిశుద్ధాత్ముడా నీకే వందనం ఆదరణ కర్తా Lyrics

పరిశుద్ధాత్ముడా నీకే వందనం (4)
ఆదరణ కర్తా సమాధాన కర్త (2)
సర్వ సత్యములోనికి నడిపే
మా ప్రియా దైవమా (2) ||పరిశుద్ధాత్ముడా||
స గ గ గ గ మ గ రి స ని ద ప
స గ గ గ గ మ గ ని గ మ
స గ గ గ గ మ గ రి స ని ద ప
ప ద ని రి స.. రి స
మాతోనే ఉండిన వేళ శక్తితో నింపబడుదుము
సర్వ లోకానికి మేము సాక్ష్యమిచ్చెదం (2)
శక్తి చేత కానే కాదు
బలముతోను కానే కాదు (2)
నీ ఆత్మ ద్వారా జరుగును కార్యములు
నీ వల్లే జరుగును మహిమలు (2) ||పరిశుద్ధాత్ముడా||
దేవుని రాజ్యమనగా నీతియు సమాధానము
పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము (2)
ఆత్మ గల వాడే దేవుని వాడు
ఆత్మ మూలముగా జీవించును (2)
విజ్ఞాపనమును చేయును మన పక్షముగా
సమస్తమును బోధించును (2) ||పరిశుద్ధాత్ముడా||

Your favourites

  • No Favourites found!