Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము నీ సంఘముపై నీ Telugu Christian Song Lyrics

పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము నీ సంఘముపై నీ Lyrics

పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము నీ సంఘముపై నీ వర దీవెనల నుంచుమీ
చిరుత కాలపు సభ కా పరు లొంది నీ యగ్ని యరుల నెదిరించి చా
టిరి నీదు సత్యంబు ||పరి||

1. బలుఁడా యీ కాలంబునన్ దివారాత్ర ములు నీదు సేవకులున్
నలు దిక్కులను దిరిగి విలసిల్లు నీ వార్త పలు జనాంగములకుఁ బ్రకటించు
చుందురు ||పరి||

2. ప్రతిదేశము దిప్పుడు ఉజ్జీవముఁ బడసిరి నీ బిడ్డలు అతులుండు నీ
పుత్రుఁ డాజ్ఞాపించిన యట్లే యతి తీవ్రతను వేఁడ అధిపా మాకొసఁ
గుము ||పరి||

3. పరిశుద్ధాత్మ బలంబును వాక్యపు ధృతినిఁ బడసిన బోధకులను
ఇరుల శక్తిని ద్రోసి నరులను నీ తట్టు మరలఁ జేసెడువారిఁ ద్వరలోఁ
బంపుము దేవ ||పరి||

4. నీ యాత్మ కాంతితోడఁ బూర్వము వలెనే డాయంగ మముఁ జేయుమా
యే యడ్డున్నను బాపి యెలమి నింగిని జీల్చి దాయుము మము స్వేచ్ఛ
దయచేసి నీ యొద్దఁ ||పరి||

5. జను లెల్ల నీ వాక్యపు శక్తి నెఱింగి ఘనపరపఁ ద్వరచేయుము పెను
సంఘములు లోక మున నాటి యిశ్రాయేల్ జనపు నిద్రను బాపు జయ
మొందు నీ వాక్కు ||పరి||

6. ఇల సంఘమున నెడారుల్ కప్పుము దేవ తొలఁగించు మాటంకము
అల నీ వాక్యమునకు నడ్డంబు లేమియు గలుఁగకుండఁగ నిమ్ము ఘన
సంఘాధ్యక్షుండ ||పరి||

7. నీ సంఘమును నబద్ధ బోధలనుండి నిర్మలంబుగఁగావుమా గాసిఁజేసెడు
జీత గాండ్లను బాపి నీ భాసిల్లు నుద్యాన వనముగ నుంచుమా ||పరి||

Your favourites

  • No Favourites found!