Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరిశుద్ధాత్మునిఁ బొందుము ప్రభువిచ్చెడు వరసహాయునిఁ బొం Telugu Christian Song Lyrics

పరిశుద్ధాత్మునిఁ బొందుము ప్రభువిచ్చెడు వరసహాయునిఁ బొం Lyrics

పరిశుద్ధాత్మునిఁ బొందుము ప్రభువిచ్చెడు వరసహాయునిఁ బొం దుము
పరిశుద్ధవర్తనకు పరమసాహాయ్యంబుఁ పరముఁజేరువఱకు పరి పూర్తిగా
దొరకు ||పరి||

1. పరిశుద్ధాత్మునిఁ గల్గిన మన రక్షణ పరిపూర్ణమై యుండును పరమ
రక్షకుఁడిచ్చు పరిపూర్ణ రక్షణను పరమానందముతోడఁ పరగఁగైకొను
మిపుడే ||పరి||

2. పరిశుద్ధాత్మునిఁ గల్గిన బైబిలువాక్య పరమసారము తేటగుఁన్ పర
మండలపుఁ తండ్రి పరిశుద్ధచిత్తంబు పొరపాటులేకుండ విరివిరిగాఁ
దెలియును ||పరి||

3. పరిశుద్ధాత్మునిఁ గల్గినఁ బ్రార్థనలందుఁ పరమ పాటవ మబ్బును
సరిగాఁ బ్రార్థించెడు సరణియుఁ దెలియును వరములను బొందుటకు
తెరువులభియించును ||పరి||

4. పరిశుద్ధాత్మునిఁ గల్గిన శోధనములఁ పరమ విజయము గల్గును
దురితంపు శోధనలఁ దొలగింప నా ప్రభువు పరమశక్తినొసంగి కరుణతో
జయమిచ్చు ||పరి||

5. పరిశుద్ధాత్మునిఁ గల్గిన జీవితమెల్లఁ పరిశుద్ధముగ నుండును పరిశుద్ధ
జీవితము కరము సాధ్యంబగును పరిశుద్ధాత్ముని శక్తిన్ వర్తింపఁగలమట్లు
||పరి||

Your favourites

  • No Favourites found!