Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరిశుద్ధులై యుండుడి దైవ చిత్తమున పెరుగుడి Telugu Christian Song Lyrics

పరిశుద్ధులై యుండుడి దైవ చిత్తమున పెరుగుడి Lyrics

పరిశుద్ధులై యుండుడి దైవ చిత్తమున పెరుగుడి
యథార్దులై యుండుడి
1. నడతలలో - వస్త్రములలో
ఆటంకము లేమియు లేకుండ
అడుగు ప్రశ్న జవాబులలో
విడువకజూపుము - పరిశుద్ధత
2. పనులలోన ప్రతిస్థలమున
పరిశుద్ధ జీవిత మవసరము
ప్రతిదారిన్ - ప్రతి సమయమున
పనులలో చూపుము - పరిశుద్ధత
3. ప్రేమ ఐక్యత పెరుగజేయున్
శ్రమ దుఃఖముల దూరపరచున్
ప్రియముతో నెల్లరు చేరిపోరు
మాని కోరుము - పరిశుద్ధత
4. దేవునిపోలిన జీవముఁజూప
కావలయును పావన జీవం
జీవిత వేషంబు వ్యర్థము
కీడునుబాపును - పరిశుద్ధత
5. శుద్ధసాక్ష్యము - భద్రపరచును
ఇద్దరిణిలో సిద్ధపరచున్
శుద్ధమగు - చిత్తంబు కలుగు
శాశ్వతశుద్ధి - పరిశుద్ధత
6. నీతితోడ - జ్యోతియుండిన
లేదు కొఱత లేదు చూడన్
మేదినిపై నిలుచు శేషము
వాదమేమి నికలేదు - పరిశుద్ధత
7. ఇలను దేహమాత్మలందు
కల్మషంబు కానరాదు
తెలుపగు తేటైన మచ్చలు
సిలువరక్తమున – పరిశుద్ధత


Your favourites

  • No Favourites found!