Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి పాడి యార్భటించి Telugu Christian Song Lyrics

పరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి పాడి యార్భటించి Lyrics

1. పరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి - పాడి యార్భటించి పరముననుండ
పరమానంద గీతమచ్చట ధ్వనింప - నీ వచట నుందువా? (3) నా మానసమా!
2. గొర్రెపిల్లయు రాజ్యమేలుచుండ - నాశ్రితు లెల్లరు నాయనను చేర
మిత్రుడెల్ల కన్నీటి దుడుచుచుండ - నీ వచట నుందువా? నా మానసమా!
3. పేతురు పౌలు యోహాను నచట - పితామహులు యపొ స్తలులందరు
హతసాక్షులెల్లరు సమావేశింప - నీ వచట నుందువా? నా మానసమా!
4. జగములో సిలువను మోసినచో - కిరీటము ధరియించి భాసిల్లుదురు
దేవ పుత్రులుగా నెల్లరు మారగా - నీ వచట నుందువా? నా మానసమా!
5. శోధనల జయించిన వీరులెల్ల - కష్టశ్రమలోర్చిన మహాత్ములు
జ్యోతిర్మయులుగా నొప్పారుచుండ - నీ వచట నుందువా? నా మానసమా!
6. కన్యకరణినాడు ప్రభుసంఘము - రాజు యేసు పెండ్లి కుమారునికి
భార్యగా ప్రకాశింప దాని రుచింప - నీ వచట నుందువా? నా మానసమా!
నేనచట నుండెదను నా యేసుతోడ


Your favourites

  • No Favourites found!