పరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల రాజు యేసు
బలవంతుడు బలమిచ్చును – ప్రభువుల ప్రభువు క్రీస్తు (2)
గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూ
అగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ (2)
ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా
ఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా||పరిశుద్ధుడు||
నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును
కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును (2)
ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగా
ఎన్నటికీ ఓడిపోను – జయశాలి నీవుండగా ||పరిశుద్ధుడు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు Lyrics
Your favourites
- No Favourites found!
