Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పర్వతమా నీవేపాటి జెరుబ్బాబెలు ఎదుటను సమభూమి Telugu Christian Song Lyrics

పర్వతమా నీవేపాటి జెరుబ్బాబెలు ఎదుటను సమభూమి Lyrics

పర్వతమా నీవేపాటి
జెరుబ్బాబెలు ఎదుటను
సమభూమి వగుదువు
అను జనులందరూ కృప కలుగుననగా
తానుంచున్ - పై - రాతిన్
1. శక్తితో కాదిది బలముతో కాదు
నాదు ఆత్మచే జరుగును యిదియనే
సైన్యములధిపతి యెహోవా వాక్కిది
మారదెన్నటికిన్
2. కాన ఆలయమును నిర్మింపను
పూనుకొందము రమ్మని పలుక
మేలైన ఈ కార్యమును చేయను
బలమును పొందితిమి
3. ఆకాశమందున నివాసియగు ప్రభు
మా యత్నములను సఫలము చేయునని
ఆయన దాసులమగు మేమెల్లరము
మొదలిడి ముగించితిమి
4. మందిరమును నాదు మహిమతో నింపుదున్
మించును అదియెంతో మునుపటి దానిన్
మెండుగ నాదు నిండు నెమ్మది
నుండ నను గ్రహింతున్
5. సజీవ రాళ్ళుగ ఆత్మ మందిరమున
నిపుణతతో మము నిర్మించుటకు
పిలిచితివి నీదు యాజకులుగను
హల్లెలూయ పాడెదము


Your favourites

  • No Favourites found!