Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పశ్చాత్తాపము బొందుము జీవమ నీవు ప్రభుని Telugu Christian Song Lyrics

పశ్చాత్తాపము బొందుము జీవమ నీవు ప్రభుని Lyrics

పశ్చాత్తాపము బొందుము జీవమ నీవు ప్రభుని సన్నిధి కేగుము
పశ్చాత్తాపములేని ప్రజలెవ్వరికి గాని నిశ్చయముగ గల్గు నిత్యమౌ
నరకంబు ||పశ్చాత్తా||

1. ఎంత పాపవైనను జీవము క్రీస్తు చెంత పార్థనఁ జేయుము
సంతోషమును మన శ్శాంతిని నొసఁగున నంతుఁడైన విమ లాత్ముఁ
డాదరించు ||పశ్చాత్తా||

2. జారచోరకార్యము లేవైనను బారఁదోలును వేగము నారాజ్యమును వెదకు
నరు లందఱకు జీవ ధార లెచ్చెదనని కోరి కర్త వచించె ||పశ్చాత్తా||

3. వినుము ప్రభువు వాక్యము జీవము నీవు గనుము రక్షణ భాగ్యము
తనువు నిత్యముగాదు నిను నీవె నమ్మకు వినయ బుద్ధిని గ్రీస్తు ఘనము
వెదుకుము వేగ ||పశ్చాత్తా||

4. దిక్కుమాలిన దానవే జీవము ప్రభుని మ్రొక్కి పరమును జేరవే నిక్కమిది
నీ పాప మెక్కువగా నున్న మక్కువతో నిన్ను గ్రక్కున విడిపించు ||పశ్చాత్తా||

5. బలములేని దానవే జీవమ యాత్మ బలము బొందుము వేగమే యిలను
విద్యాధన బలముల నమ్మక కలుష జాలము వీడి కర కడకేగుము
||పశ్చాత్తా||

6. మందపోషకుఁడు క్రీస్తు జీవమ యేసా నందపూర్ణుఁడు థీరుఁడు
వందిత సత్సంఘ మందుఁ జేరిన సత్యా నందంబు నిత్యంబు నొందుచు
నుందువు ||పశ్చాత్తా||

Your favourites

  • No Favourites found!