Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పేద నరుని రూపము ధరించియేసు రాజు Telugu Christian Song Lyrics

పేద నరుని రూపము ధరించియేసు రాజు Lyrics

పేద నరుని రూపము ధరించి
యేసు రాజు నీ చెంత నిలచె
అంగీకరించు-మాయనను (2) ||పేద నరుని||

1. కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడే
నింద వేదన శ్రమలను సహించెనేసు (2)
చిందే తనదు రక్తము నీ పాపముకై (2)
దీనుడై నిన్ను పిలచుచుండె (2) ||పేద నరుని||

2. తల వాల్చుటకు ఇల స్థలమే లేదు
దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2)
తన్ను ఆదరించు వారెవరు లేరు
ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే
పాట్లుపడే నిన్ను విడిపింపను (2) ||పేద నరుని||

3. మాయ లోకమును నీవు నమ్మకుము
మనుష్యుల మనస్సు మారిపోవునిల (2)
నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు
నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
నేడే రమ్ము విశ్వాసముతో (2) ||పేద నరుని||

Your favourites

  • No Favourites found!