పిల్ల నైన నన్నుఁ జూడుమీ ప్రియ మైన యేసు పిల్ల నైన నన్నుఁ
జూడుమీ చల్లని రక్షకుఁడ వనుచు సత్య వార్తఁ దెలుపుచుండ నుల్ల
మందు నిన్ను నమ్మి కల్ల లేక వేఁడుకొందుఁ ||బిల్ల నైన||
1. నిన్ను నమ్మి యున్నవాఁడను ఘన దేవ తనయ నన్ను దాఁచు నీ నీడను
తిన్నని హృదయంబు నాకుఁ జెన్నుగా నొసంగి యిపుడు సన్నుతింప
నిమ్ము నన్ను సాధు వైన నిన్నుఁ దలఁచి ||పిల్ల నైన||
2. ప్రేమచేత నొప్పుచుంటివి ప్రేమా స్వరూప ప్రేమలోన నడచు చుంటివి
ప్రేమ లేని నన్నుఁ బ్రోవఁ బ్రేమచేత బ్రాణ మిచ్చి ప్రేమఁ జూపు
మనుచు నన్నుఁ బ్రీతి చేత బోధింపఁ ||బిల్ల నైన||
3. పరమ జనకు చిత్త మెప్పుడు పరమేశ పుత్ర బిరబిరగను జేయఁగా నిమ్ము
కరుణ మీర నాత్మచేత వరవరంబు లొసఁగి నాకు నరిలలోన నిన్నుఁ
గొలువ ధరణిమీఁద నన్ను నిలుపఁ ||బిల్లనైన||
4. బలము మీర నన్ను నిలుపుము తుల లేనివాఁడ బలము గల్గు నీదు
చేతుల నిలను నీకు ఫలము లిచ్చి యెలమి నిన్ను గొప్పఁ జేయ
సలలిత ముగ నడువ నిమ్ము చక్కని నీ మార్గమందుఁ ||బిల్లనైన||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పిల్ల నైన నన్నుఁ జూడుమీ ప్రియ Lyrics
Your favourites
- No Favourites found!
