Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పొందితిని నేను ప్రభువా నీ నుండి Telugu Christian Song Lyrics

పొందితిని నేను ప్రభువా నీ నుండి Lyrics

పొందితిని నేను ప్రభువా నీ నుండి
ప్రతి శ్రేష్టయీవిని ఈ భువియందు
1. జీవిత యాత్రలోసాగి వచ్చితిని - ఇంతవరకు నాకుతోడై యుండి
ఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా - నా రక్షణ కర్తవు నీవైతివి
2. గాలి తుఫానులలో నుండి వచ్చితిని - అంధకారశక్తుల ప్రభావమునుండి
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా - నీవే ఆశ్రయ దుర్గం బైతివి
3. కష్టదుఃఖంబులు నాకు కలుగగా - నను చేరదీసి ఓదార్చితివే
భయభీతి నిరాశలయందున ప్రభువా - బహుగా దైర్యంబు నా కొసగితివి
4. నా దేహమందున ముల్లు నుంచితివి - సాతానుని దూతగా నలుగగొట్టన్
వ్యాధి బాధలు బలహీనతలందు - నీ కృపను నాకు దయచేసితివి
5. నీ ప్రేమచేత ధన్యుడనైతిని - కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
కష్టపరీక్షల యందున ప్రభువా - జయజీవితము నాకు నేర్పించితివి


Your favourites

  • No Favourites found!