Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పూజనీయుడేసు ప్రభు పలునిందల నొందితివా నాకై Telugu Christian Song Lyrics

పూజనీయుడేసు ప్రభు పలునిందల నొందితివా నాకై Lyrics

పూజనీయుడేసు ప్రభు
పలునిందల నొందితివా నాకై (2)      ||పూజనీయుడేసు||

నీ స్వకీయులే నిందించినా
నిన్నంగీకరించక పోయినా (2)
ఎన్నో బాధ లొందితివా నాకై (2)
సన్నుతింతును నీ ప్రేమకై         ||పూజనీయుడేసు||

సత్యము మార్గము మరి జీవమై
నిత్యజీవమియ్యను వచ్చితివి (2)
వంచకుడవని నిన్ను నిందించిరా (2)
ఓ దయామయా నజరేయుడా         ||పూజనీయుడేసు||

యూదా గోత్రపు ఓ సింహమా
ఆద్యంతరహిత దైవమా (2)
అధములు నిను సమరయుడనిరా (2)
నాథుడా నిను బహు దూషించిరా         ||పూజనీయుడేసు||

మధురం నీ నామం అతి మధురం
మధుర గీతముతో నిన్నారాధింతును (2)
వధియించబడితివా యీ పాపికై (2)
వందితా ప్రభు నిన్ను పూజింతును         ||పూజనీయుడేసు||

Your favourites

  • No Favourites found!